15/06/2026
🔥 యుద్ధంలో ఎవరు గెలిచారు...? అని అందరూ అడుగుతారు.
కానీ...
💡 "యుద్ధం వల్ల ఎవరు ధనవంతులు అయ్యారు...?"
అనే ప్రశ్న చాలా తక్కువ మంది అడుగుతారు.
ఒక దేశం యుద్ధం చేస్తే...
సరిహద్దుల్లో సైనికులు పోరాడతారు.
ప్రజలు ప్రాణాలు కోల్పోతారు.
కుటుంబాలు కన్నీళ్లు పెడతాయి.
కానీ...
మరో వైపు కొందరి వ్యాపారాలు పెరుగుతాయి.
కొన్ని పరిశ్రమలకు కొత్త అవకాశాలు వస్తాయి.
కొన్ని కంపెనీల విలువలు పెరుగుతాయి.
ఇది యుద్ధాన్ని సమర్థించడం కాదు...
కాని ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం.
💡 యుద్ధం వార్తలు వస్తే...
చాలామంది...
"ఇప్పుడు ఏం అవుతుందో?"
"రేట్లు పెరుగుతాయట!"
"పెట్రోల్ దొరకదట!"
"మార్కెట్ పడిపోతుందట!"
అని భయపడతారు.
కానీ...
కొంతమంది మాత్రం...
"ఇందులో అవకాశం ఎక్కడ ఉంది?"
"ఏ రంగాలు ప్రభావితం అవుతాయి?"
"ఏ సమస్యకు కొత్త పరిష్కారం అవసరం అవుతుంది?"
అని ఆలోచిస్తారు.
COVID సమయంలో కూడా ఇదే జరిగింది.
కొంతమంది పరిస్థితులను తిట్టారు.
మరికొందరు పరిస్థితులను చదివారు.
కొంతమంది అవకాశాల కోసం ఎదురు చూశారు.
మరికొందరు అవకాశాలను సృష్టించుకున్నారు.
🔥 కష్టాలు అందరికీ వస్తాయి...
కానీ...
కష్టాల్లో కూడా నేర్చుకునేవారే ఎదుగుతారు.
సమస్యను చూసి భయపడేవారు పరిస్థితులకు బానిసలు అవుతారు.
సమస్యను చూసి పరిష్కారం వెతికేవారు నాయకులు అవుతారు.
ప్రపంచంలో ప్రతి పెద్ద సంఘటన...
కొందరికి సమస్య.
మరికొందరికి అవకాశం.
అందుకే...
వార్తలను కేవలం వార్తలుగా చూడొద్దు.
ప్రతి సంఘటన వెనుక ఉన్న ఆర్థిక ప్రభావాన్ని అర్థం చేసుకోండి.
డబ్బు ఎటు ప్రవహిస్తుందో గమనించండి.
ఎందుకంటే...
సాధారణ ప్రజలు సంఘటనలను చూస్తారు.
తెలివైనవారు ప్రభావాలను చూస్తారు.
విజేతలు మాత్రం...
భవిష్యత్తును ముందుగానే గుర్తిస్తారు.
💡 ప్రతి సంక్షోభం ఒక సమస్యను తీసుకొస్తుంది...
అదే సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా తీసుకొస్తుంది.
మీరు దేనిపై దృష్టి పెడతారో...
మీ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంటుంది.
- Ananthula Kishore Kumar
Financial Wealth Planner
Kishore Kumar Financial Insights
🔥 సమస్యలో ఇరుక్కోకు...
అందులో దాగి ఉన్న అవకాశాన్ని వెతుకు.