18/07/2024
An expert is someone who, over many years, manages to remain confident enough to keep trying and humble enough to keep learning"
# Approved by "DTCP" & Certified by "RERA"
Any Enquiry : https://www.bbgindia.com/
Or
CALL ME NOW : 9848289994
Associate Id : IBA0430317
బిబిజి యొక్క జంట మౌళిక సిద్ధాంతాలు
బిబిజి యొక్క జంట మౌళిక సిద్ధాంతాల ప్రకారం ప్రతి భారతీయునికి సొంత భూమి ఉండాలి మరియు ప్రతి భారతీయ ఆడపిల్ల విద్యోన్నతి ద్వారా సాధికారత పొందాలి.
ప్రతి భారతీయునికి సొంత భూమి ఉండాలి
ప్రతి భారతీయునికి సొంత భూమి ఉండాలి అన్న దృష్టి తత్వంతో బిబిజి స్థాపించబడింది, 17 ఏళ్ళ దీర్ఘకాల పయణంలో బిబిజి ఇప్పటివరకు, 1.1 లక్షల భారతీయులకు సొంత భూమిని సమకూర్చింది, 2040 సంవత్సరం వరకు 10 లక్షల భారతీయులకు సొంత భూమిని ఉండాలని ఆకాంక్షిస్తున్నది.
ప్రతి భారతీయ ఆడపిల్ల విద్యోన్నతి
ద్వారా సాధికారత పొందాలి
ప్రతి ఒక్క ఆడపిల్లకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు భరోసా కల్పించాలనేదే బిబిజి ఉద్దేశం. 2040 కల్లా సుమారు 20 లక్షలకు పైగా బాలికల జీవితాల్లో విద్యా వెలుగులు నింపే లక్ష్యంతో అవిరాళమైన కృషి చేస్తూ బిబిజి ముందుకు సాగుతోంది.
ఎంతోమంది భారతీయులకు భూ పెట్టుబడులను అందించాం
2007 నుంచి 2023 వరకు సాగిన ఈ విశేషమైన పదిహేడేళ్ల ప్రయాణంలో బిబిజి మొత్తం 21 క్లస్టర్లలో 230 పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. కేవలం ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు తద్వారా 1.10 లక్షల హ్యాపీ కస్టమర్లతో ఒక నిజమైన సంపదను సృష్టించింది. 18000 మంది బిజినెస్ అసోసియేట్స్ కు ఆర్థిక స్వేచ్ఛను కల్పించింది. 200 మంది ఉద్యోగుల కెరీర్ గ్రోత్ తో పాటు 1,70,000 మంది బాలికలకు సాధికారత కల్పించింది.
ఇప్పుడున్న ఉత్సాహాన్ని మరో రెండింతలు చేసుకుని2040 వరకు అవలంబించాల్సిన విధానంతో కూడిన భవిష్యత్ కార్యాచరణను బీబీజీ అమలులో పెట్టింది అందులో భాగంగానే ఇప్పుడున్న ప్రాజెక్టులకు అదనంగా మరో 770 కొత్త ప్రాజెక్టులు జత చేసి 1000 ప్రాజెక్టులు ఇప్పుడున్న క్లస్టర్లు అదనంగా మరో 79 కొత్త క్లష్టర్లతో 100 క్లష్టర్లు ఇప్పుడున్న కార్యాలయాలకు అదనంగామరో 88 కొత్త కార్యాలయాలతో మొత్తం 100 కార్యాలయాలు, అలాగే మరో 8.9 కొత్త కస్టమర్ల జత చేసి మొత్తం పది లక్షల కస్టమర్లకు సేవలు అందించే విధంగా బిబిజీ అడుగులు వేస్తోంది. దీనితో పాటు అదనంగా మరో 82వేల మంది బిజినెస్ అసోసియేట్స్ కు ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించి ఇప్పుడున్న సంస్థను భవిష్యత్తులో లక్షకు పెంచేందుకు కృషి చేస్తోంది. అలాగే మరో 1800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మొత్తంగా 2000 మందిని బిబిజి ఇప్పుడున్న సంఖ్యను ఉద్యోగులుగా కెరీర్ గ్రోత్ ఇవ్వాలని సంకల్పించింది. అదనంగా 18.4 లక్షల బాలికలకు సాధికారతను అందించి 2 మిలియన్లకు పెంచాలనే ధ్యేయంతో మన సంస్థ అడుగులు వేస్తోంది.
బంగారుతల్లి
ప్రాపంచిక దృష్టితో ఉధ్భవించిన బిబిజి మొదటి నుంచి కూడా నమ్మేది ఒకటే, కుటుంబంలో ఒక ఆడపిల్ల సాధికారత చెందిననాడే మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అట్టడుగు వర్గాల్లోని బాలికల విద్యోన్నతే లక్ష్యంగా చేపట్టిన బంగారుతల్లి కార్యక్రమాన్ని బిబిజి ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలో ఒక బలమైన సామజిక మార్పు తీసుకురావాలని అవిశ్రాంతమైన కృషి చేస్తోంది.
గడిచిన కొన్నేళ్ల కాలంలో బంగారుతల్లి కార్యక్రమం ఎప్పటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటూ వందకు పైగా ప్రాథమిక విద్యాసంస్థల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1.70 వేల మంది బాలికల జీవితాల్లో విద్యా వెలుగులు నింపింది. అవును, బిబిజి ఆవిర్భావం నుండి కూడా బాలికల విద్యోన్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.
ఇదే విధానంలో నిలకడగా పయనిస్తూ, గత అనుభవాలతో బిబిజి సంస్థ తన కలకు ఒక వాస్తవిక రూపాన్ని తీసుకొచ్చింది. సమాజంలో అక్షర జ్ఞానం కోల్పోతున్న ఆడపిల్లలను వెలికితీసి వారికి విద్యనందిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తుకు మరియు బలమైన దేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తోంది. సమాజంలో లింగ సమానత్వం, బాలిక సాధికారతే ధ్యేయంగా సంస్థ తన లాభాల్లో కొంత మొత్తాన్ని బంగారుతల్లి పథకానికి కేటాయిస్తోంది. తద్వారా బాలికలకు స్కాలర్ షిప్స్, ప్రోత్సాహాకాలను అందిస్తూ వారిని ఉన్నత విద్య దిశగా తీసుకు వెళ్లేందుకు పురిగొల్పుతుంది.
ఈ క్రమంలోనే బంగారుతల్లి కార్యక్రమం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇంకా సాధిస్తూనే ఉంటుంది. అనేక ప్రాంతాల్లోని ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఈ ప్రయాణంలో సంస్థ పట్ల వినియోగదారులు, ఉద్యోగులు, సంబంధిత వ్యక్తులు చూపిన నమ్మకానికి, సహకారానికి సంస్థ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది
టాలెంట్ టీమ్
ఇక బిబిజి సంస్థలో ఉన్న నైపుణ్య బృందానికి ఉన్న అనుభవం విషయానికి వస్తే సుమారు 30 ఏళ్లుగా వారు ఈ రంగంలో ఉన్నారు. ఈ బృందం పనితీరు వల్ల సంస్థకు ఉండాల్సిన ప్రధాన విలువలు అనగా నిర్ణీత కాలంలో ప్లాట్ డెలివరీ, పారదర్శకత, భారీ స్థాయిలో అభివృద్ధి, ఐక్యత, ఎదుగుదల మరియు సామర్థ్యం వంటి వాటి విషయాలలో రాజీ అనే ప్రసక్తి ఉండదు. ఎప్పటిలానే బిబిజి సంస్థ అత్యంత విలువైన భూ సంపదను తన కస్టమర్లకు అందించేందుకు అంకితం చేయబడింది.
ఇలాంటి ప్రధాన విలువలన్నింటిని తూచ తప్పకుండా పాటిస్తూ, ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ బిబిజి తన కస్టమర్లకు సౌకర్యవంతమైన, సులభతరమైన రియల్ ఎస్టేట్ సేవలను అందిస్తోంది. ఎప్పటికప్పుడూ నిపుణులైన వారి సహకారం తీసుకుంటూ పూర్తి నిబద్దతతో పనిచేస్తుండటం వల్ల బిబిజి తన కస్టమర్లకు అత్యంత బలమైన, మెరుగైన, ప్రకాశవంతమైన సేవలను మరియు ఆస్తులను కల్పిస్తోంది.
విలువైన భాగస్వాములు
బిబిజి సంస్థ అనేక ఇతర ప్రముఖ కంపెనీలు, కార్పోరేట్ సంస్థలతో చేతులు కలిపింది. దీనివల్ల కొన్నిసార్లు ఇరు పక్షాలకు అద్భుతమైన పరస్పర ప్రయోజనాలు చేకూరుతాయి. ఇటువంటి భాగస్వామ్యాల వల్ల బిబిజి తన కస్టమర్లకు అత్యంత గౌరప్రదమైన, అద్భుతమైన మరియు ఎటువంటి లోటుపాట్లు లేని సంపదను, సేవలను అందించడానికి దోహదపడతాయి.
పెర్ఫార్మన్స్, జవాబుదారీతనం, సమగ్రత మరియు గౌరవం
పెర్ఫార్మన్స్, జవాబుదారీతనం, సమగ్రత మరియు గౌరవం వంటి విలువలే బిబిజి సంస్థ అభ్యున్నతికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి. కాలాతీతంగా ప్రతి ఒక్క సంస్థకుగానీ, వ్యక్తికి గానీ ఉపయోగపడే ఈ విలువలను బిబిజి తన ప్రతి కార్యకలపాల్లోనూ తమ భాగస్వాములకు, ఉద్యోగులకు మరియు వినియోగదారులకు సమానంగా అమలుపరుస్తోంది. పెర్ఫార్మన్స్: మేము చేసే ప్రతి పనిలో శ్రేష్ఠత కోసం మేము ప్రయత్నిస్తాము, మా క్లయింట్ల అంచనాలను అందుకోవడానికి మరియు అధిగమించడానికి మా ప్రక్రియలు మరియు సేవలను నిరంతరం మెరుగుపరుస్తాము. పెర్ఫార్మన్స్ పట్ల మా నిబద్ధత మన లక్ష్యాలను సాధించడంలో పోటీతత్వం, వినూత్నత మరియు ప్రభావవంతంగా ఉండేలా నిర్ధారిస్తుంది. కంపెనీ కట్టుబాట్ల ద్వారా తమ క్లయింట్లకు పూర్తి డెలివరీ అందించడమే, జవాబుదారీతనం యొక్క సారాంశం.
సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నిజాయతీ మరియు నైతిక ప్రమాణాలను పాటిస్తూ ఒక సహృద్భావ వాతవరణం కలిగిన సమగ్రతను అందజేస్తుంది, ప్రతి ఒక్క వినియోగదారునికి మరియు సంస్థలోని ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవంతో కూడిన ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తుంది.
మిషన్
బిబిజి యొక్క మొట్టమొదటి ధ్యేయం బాలికల సాధికారత. బిబిజి ద్వారా భూమిని కొనుగోలు చేసిన వినియోగదారుల సహాయ సహకారాలతో పాటు, సంస్థ లాభాల్లోని కొంత మొత్తాన్ని అర్థిక స్థోమత లేని బాలికల ప్రాథమిక విద్యకు వినియోగిస్తుంది. బాలికలు అత్యుత్తమమైన విద్యను అభ్యసించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపేలా తీర్చిదిద్దాలని బిబిజి కోరుకుంటోంది. తద్వారా' వారు సమాజంతో పాటు, భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆశిస్తోంది.
బిబిజి గత ప్రస్థానం
పదిహేడేళ్ల బిబిజి ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు ఒక బలమైన పునాదులపై సగర్వంగా నిలబడి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాజెక్టులను చేస్తూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో బిబిజి ఒక బలమైన బ్రాండుగా రూపుదిద్దుకుంది. సుమారు 5000 మంది బిజినెస్ అసోసియేట్స్ తో తన సత్తా చాటుతోంది. ప్రతీ ఏడాది, గడిచిన ఏడాదికంటే పదింతల లాభాలతో, అర్థిక స్థిరత్వంతో భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది.
ఇది అంతా చదివి అర్థం చేసుకుంటారని సంస్థ యొక్క విలువలు నిబద్ధత వచ్చిన ఆదాయంతో విలువలతో కూడిన భాధ్యత ద్వారా బంగారు తల్లులకు ఆసరాగా చేస్తున్న కార్యక్రమాల ద్వారా మనలో ఎంతోమంది జీవితాలు బాగుచేసిన సంస్థలో మనం కూడా భాగస్వాములు అవుదాం పైసా పెట్టుబడి లేకుండా 35 వేల కోట్లు విలువచేసే ఆస్తులు అమ్ముదాం మన జీవితాలు బాగు చేసుకుందాం.